Header Banner

తిరుపతి తొక్కిసలాట ఘటనపై నాలుగో దశ విచారణ! కీలక అంకానికి చేరుకున్న కమిటీ పరిశీలన!

  Wed Apr 02, 2025 13:15        Others

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిటీ నాలుగో దశ విచారణను ప్రారంభించింది. ఈ విచారణ రెండు రోజుల పాటు తిరుపతి కలెక్టరేట్‌లోని తాత్కాలిక కార్యాలయంలో జరుగుతోంది. సస్పెండైన డీఎస్పీ రమణకుమార్‌ను జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిటీ విచారించింది. అలాగే, టీటీడీ మాజీ సీవీఎస్‌వో శ్రీధర్ కూడా మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ ఘటనపై ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్, కలెక్టర్‌ను విచారించిన కమిటీ, తొక్కిసలాట సమయంలో విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడిని కూడా ప్రశ్నించింది.

 

విచారణ కమిటీ తొక్కిసలాటలో గాయపడిన 200 మందిని ఇప్పటికే ప్రశ్నించి, ఘటనకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తోంది. జేఈవోగా పనిచేసిన గౌతమీ, మాజీ సీవీఎస్‌వో శ్రీధర్‌ను కూడా విచారణలో భాగంగా ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు కమిటీ కృషి చేస్తోంది. బాధితుల పక్షాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కమిటీ పని చేస్తోంది. ఈ విచారణ ద్వారా తగిన పాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #TirupatiStampede #JusticeForVictims #InquiryCommittee #TirupatiIncident